త్రిపుర‌లో కాషాయ జెండా రెప‌రెప‌

BJP wins In Tripura assembly election
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
బీజేపీ చిరకాల ల‌క్ష్యం నెర‌వేరుతోంది. క‌మ్యూనిస్టుల కంచుకోట త్రిపుర‌ను చేజిక్కించుకుంటోంది. 25 ఏళ్ల‌గా వామప‌క్షాల‌కు పెట్ట‌నికోట‌గా ఉన్న త్రిపురలో ఎలాగైనా కాషాయ‌జెండాను రెప‌రెప‌లాడించాల‌న్న అమిత్ షా, మోడీ ఆశ‌లు నెర‌వేరుతున్నాయి.  త్రిపుర‌లో మొత్తం 59 స్థానాలుండ‌గా… బీజేపీ స్ప‌ష్ట‌మైన ఆధిక్యంలో కొన‌సాగుతోంది. ఆ పార్టీ మొత్తం 40 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. సీపీఎం 24 స్థానాల్లో ముందంజ‌లో ఉంది. ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైన తొలిగంట‌ల్లో వామ‌ప‌క్ష కూట‌మి ఆధిక్యం క‌న‌బ‌ర్చింది.
అయితే ఆ పార్టీ ఆశ‌లు ఎక్కువ‌సేపు నిల‌వ‌లేదు. లెక్కింపు కొన‌సాగుతున్నకొద్దీ… ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు బీజేపీ కూట‌మి ఆధిక్యంలోకి వ‌చ్చింది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు 31  స్థానాలు కావాలి. త్రిపుర‌లో వెలువ‌డుతున్న ఫ‌లితాలు బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈశాన్య రాష్ట్రాల‌కు సంబంధించి మొత్తం రాజ‌కీయ ముఖ‌చిత్రాన్నే మార్చివేస్తాయ‌ని కేంద్ర‌మంత్రి కిర‌ణ్ రిజిజు అన్నారు. 2013 ఎన్నిక‌ల్లో త్రిపుర‌లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. ఐదేళ్ల‌లో ప‌రిస్థితి మారిపోయింది.