ఎక్కడా ఆట పడటం లేదు

South India states theaters Bandh against Digital Service providers

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
సౌత్‌ ఇండియా సినీ ప్రేక్షకులకు ఇదో గడ్డు కాలం. నిన్నటి నుండి మూడు దక్షిణ భారత రాష్ట్రాల్లో కూడా సినిమా థియేటర్లు మూత పడ్డాయి. కొన్ని వేల థియేటర్లను సౌత్‌ ఇండియా నిర్మాతల మండలి వారు మూసేయడం జరిగింది. డిజిటల్‌ ప్రొవైడర్ల తీరుకు నిరసనగా నిరవదికంగా థియేటర్లను మూసేస్తున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు. మొదట ఈ బంధ్‌ను అంతా తేలికగా తీసుకున్నారు. కాని అన్ని ఏరియాల్లో కూడా థియేటర్ల బంద్‌ చాలా సీరియస్‌గా సాగుతోంది. థియేటర్లలో సినిమాల ప్రదర్శణ నిలిపేయడంతో పాటు, అసలు థియేటర్ల గేట్లు కూడా తెరుచుకోవడం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని థియేటర్ల ముందు కూడా డిజిటల్‌ ప్రొవైడర్ల తీరుకు నిరసనగా బంద్‌ను నిర్వహిస్తున్నట్లుగా బోర్డులు పెట్టారు. ప్రస్తుతం నిర్మాతలు డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. గత కొంత కాలంగా నిర్మాతలు మరియు థియేటర్‌ యాజమాన్యం వారు డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు భారీ ఎత్తున చెల్లించారని, ఇప్పటికైనా ఆ మొత్తంను తొలగించాల్సిందే అంటూ నిర్మాతల మండలి వారు కోరుతున్నారు. కాని డిజిటల్‌ ప్రొవైడర్లు మాత్రం రుసుం తగ్గించేది లేదు అంటూ భీష్మించుకు కూర్చున్నారు. ఈ విషయమై ప్రభుత్వ పెద్దలు కూడా చర్చు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం దక్కే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. తెలుగులో పెద్ద సినిమాలు ప్రస్తుతం ఏమీ లేని కారణంగా థియేటర్ల బంద్‌ ప్రభావం పెద్దగా లేదని చెప్పుకోవచ్చు.