డెంగీ నియంత్రణలో రక్తం నాణ్యత

డెంగీ నియంత్ర ణలో రక్తం నాణ్యత
ఇటీవల కాలంలో డెంగీ బాధితుల సంఖ్య బాగా పెరిగిపోయింది. అయితే, రక్తంలో ఐరన్‌ శాతం ఎక్కువగా ఉండే వారికి ఈ వైరస్‌ సోకే అవకాశం తక్కువని ఇటీవల జరిపిన ఓ పరిశోధనలో తేలింది. ఐరన్‌ ఉండే ఆహారాన్ని ఎక్కు వగా తీసుకోవడం వల్ల డెంగీ వ్యాప్తిని కాస్త నియంత్రించవచ్చని పరిశోధకులు తెలిపారు. డెంగీ నియంత్ర ణలో రక్తం నాణ్యత ఎలాంటి పాత్ర పోషిస్తోందో తెలుసుకునేందుకు అమెరికాలోని కన్నెక్టికట్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఆరోగ్యంగా ఉన్న కొందరి రక్త నమూనాల్లోకి డెంగీ వైరస్‌తో ఉన్న దోమలను వదిలారు. ఐరన్‌ శాతం తక్కువ ఉన్న రక్తంలోకి వైరస్‌ను ఆ దోమలు సులభంగా ప్రవేశపెట్టగలిగాయి. మలేరియా కూడా ఇలాగే వస్తుందని వారు చెప్పారు.