53 కిలోల కంచు పతకంతో భారత మహిళా రెజ్లర్‌ వినేష్‌ ఫొగట్‌

53 కిలోల కంచు పతకంతో భారత మహిళా రెజ్లర్‌ వినేష్‌ ఫొగట్‌

వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప పతకం కోసం పరితపించిన భారత మహిళా రెజ్లర్‌ వినేష్‌ ఫొగట్‌ ఎట్టకేలకు తన కలను సాకారం చేసుకుంది. 53 కిలోల కాంస్యంతోపాటు ఒలింపిక్‌ బెర్త్‌తో డబుల్‌ ధమాకా సృష్టించింది. ఈ క్రమంలో టోక్యో విశ్వక్రీడలకు అర్హత సాధించిన తొలి భారత రెజ్లర్‌గా నిలిచింది. గతంలో మూడుసార్లు మెగా టోర్నీలో పాల్గొన్నా నిరాశతో తిరిగి వచ్చింది. అయితే, ఈసారి భారీ అంచనాలతో బరిలోకి దిగిన వినేష్‌.. ప్రీక్వార్టర్స్‌లో పరాజయంతో స్వర్ణ రేసు నుంచి నిష్క్రమించింది. కానీ, ఆమెపై నెగ్గిన జపాన్‌ ప్రత్యర్థి ముకైదా ఫైనల్‌ చేరడంతో.. పోడియంపై నిలిచేందుకు రెపిచేజ్‌ ఆడే అవకాశం దక్కింది. తొలి రోజు నిరాశపడినా.. రెపిచేజ్‌ ద్వారా లభించిన అదృష్టాన్ని వినేష్‌ రెండు చేతులా ఒడిసిపట్టుకుంది. బుధవారం జరిగిన 53 కిలోల కంచు పతక బౌట్‌లో గ్రీస్‌ రెజ్లర్‌ మరియా ప్రవోలరని పై బైఫాల్‌తో వినేష్‌ విజయ ఢంకా మోగించింది. యోంగ్‌ మి పక్‌  స్వర్ణం నెగ్గగా.. ముకైదా రజతంతో సంతృప్తిపడింది.