బ్లఫ్ మాస్టర్ మూవీ రివ్యూ…!

న‌టీన‌టులు: సత్యదేవ్, నందిత శ్వేతా, పృథ్వి, బ్ర‌హ్మాజీ, ఆదిత్యామీన‌న్‌, సిజ్జు, చైత‌న్య కృష్ణ‌
దర్శకుడు: గోపీగ‌ణేష్ ప‌ట్టాభి
నిర్మాతలు: ర‌మేష్ పిళ్లై
సంగీతం:సునీల్ కాశ్యప్
నిర్మాణ సంస్థ‌: ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్టైన్మెంట్స్
సినిమాటోగ్ర‌ఫీ:దాశరధి శివేంద్ర
ఎడిట‌ర్:దాశరధి శివేంద్ర

బ్లఫ్ మాస్టర్ మూవీ రివ్యూ…! - Telugu Bullet‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన తెలుగు నటుడు సత్యదేవ్ కంచరాన. ఆ తర్వాతా చాలా సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసినా సోలో హీరోగా ‘జ్యోతిలక్ష్మి’ సినిమా సత్యదేవ్‌కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకు పదికి పైగా సినిమాల్లో ఆయన నటించారు. ఆయన హీరోగా ‘బ్లఫ్ మాస్టర్’ అనే సినిమాతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘రోమియో’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన గోపీ గణేశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నందితా శ్వేత హీరోయిన్‌గా నటించింది. తమిళ హిట్ ‘సతురంగ వేట్టై’కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెటైరికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం కథేంటి, సినిమా ఎలా ఉంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కధ :

బ్లఫ్ మాస్టర్ మూవీ రివ్యూ…! - Telugu Bulletచిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోవడంతో ఉత్తమ్ కుమార్ (సత్యదేవ్) సమాజంపై, మనుషులపై ద్వేషాన్ని పెంచుకుంటాడు. డబ్బు లేకపోవడం వల్లే తన తల్లిదండ్రులు మరణించారని, ఈ సమాజంలో బతకాలంటే డబ్బు కావాలని ఓ నిర్ణయానికి వస్తాడు. డబ్బు కోసం మనుషులను మోసం చేయడాన్ని తన వృత్తిగా మార్చుకుంటాడు. ఉత్తమ్ కుమార్, ఆకాష్ ఇలా రకరకాల పేర్లతో వివిధ రకాలుగా మనుషులను మోసం చేస్తుంటాడు. డబ్బు సంపాదనే లక్ష్యంగా బతుకుతుంటాడు. ఈ మోసగాడికి మోసం అంటే ఏమిటో తెలియని అమ్మాయి అవని (నందితా శ్వేత) పరిచయం అవుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. అవని ప్రేమతో, అవని పరిచయంతో అప్పటివరకూ మోసాలు చేస్తూ బతికిన ఉత్తమ్ కుమార్ నిజంగా ఉత్తముడిగా, మంచివాడిగా ఎలా మారాడు? మంచివాడిగా మారిన ఉత్తమ్ కుమార్ కు ఎదురైన సమస్యలు ఏంటి? అనేది సినిమా.

విశ్లేషణ :

బ్లఫ్ మాస్టర్ మూవీ రివ్యూ…! - Telugu Bulletతమిళ సినిమా కథలో తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మార్పలు, చేర్పులు చేయడంలో దర్శకుడు గోపీ గణేష్ సక్సెస్ అయ్యాడు. అయితే కథను కొత్తగా తీర్చిదిద్దడంలో విఫలమయ్యాడు. తమిళ సినిమా ‘సతురంగ వేట్టై’ 2014లో వచ్చింది. అప్పట్లో వార్తల్లో నిలిచిన మోసాలను ఆధారంగా చేసుకుని సినిమా తీశారు. అప్పటికీ… ఇప్పటికీ… ప్రజలు మోసపోవడంలో మార్పేమీ లేదు. అయితే మోసగాళ్ల ప్రతిసారీ ప్రజలను మోసం చేయడానికి కొత్త కొత్త పద్దతులను ఎంచుకుంటున్నారు. మోసగాళ్ల నయా పద్దతులను దర్శకుడు ఎక్కువ చూపిస్తే బావుండేది. దర్శకుడిగా నటీనటుల నుంచి చక్కటి నటన రాబట్టుకోవడంలో గోపి గణేష్ విజయం సాధించాడు. అలాగే, సినిమా డైలాగులు బావున్నాయి. సన్నివేశాలకు డైలాగులు బలాన్ని ఇచ్చాయి.

బ్లఫ్ మాస్టర్ మూవీ రివ్యూ…! - Telugu Bullet

సునీల్ కశ్యప్ స్వరపరిచిన పాటలు బావున్నాయి. కథకు తగ్గట్టు చక్కటి పాటలు ఇచ్చాడు. నేపథ్య సంగీతం కూడా బావుంది. నిర్మాణ విలువలు, ఛాయాగ్రహణం, ఎడిటింగ్ పర్వాలేదు.నటుడిగా సత్యదేవ్ ఎటువంటి పాత్రలోనైనా నటించగలనని ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. మోసగాడిగా పలు సన్నివేశాల్లో ఎంత అవలీలగా నటించాడో ద్వితీయార్థంలో బావోద్వేగభరితంగా, క్లైమాక్స్ లో అంతే అద్భుతంగా నటించాడు. వాయిస్ మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీ సత్యదేవ్ ప్లస్ పాయింట్స్. అతడు డైలాగులు చెప్పే తీరుకు ప్రేక్షకులు ఫిదా కావడం ఖాయం. నందితా శ్వేత పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ ఆకట్టుకుంటుంది. పృథ్వీ, ఆదిత్యా మీనన్, చైతన్యతో పాటు మిగతావారు పాత్రలకు తగ్గట్టు నటించారు.

తెలుగు బులెట్ పంచ్ లైన్ : బ్లఫ్ మాస్టర్ – బ్లిస్ మాస్టర్
రేటింగ్ : 2.75 / 5