మంచిర్యాల జిల్లాలో విషాదం

మంచిర్యాల జిల్లాలో విషాదం

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భీమారo మండలం గొల్లవాగు ప్రాజెక్టు లో నాటుపడవ మునిగింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు నీటిలో గల్లంతై మృతి చెందారు. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. మండల కేంద్రానికి చెందిన సుంకరి సంపత్ టాటా ఏసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మరో ట్రాలీ డ్రైవర్ ఇరవేని రాజా బాపు, కలవేని రమేష్ , మచ్చ రవి ,బొంతల రమేష్ కలిసి మండలంలోని గొల్లవాగు ప్రాజెక్టులో చేపలు పట్టేందుకు వెళ్లారు.

వాగులో నాటు పడవ సహాయంతో చెరువులోకి దిగారు. ప్రమాదవశాత్తు పడవ మునుగగా బొంతల రమేష్ , ఇరవేని రాజబాపు ఇద్దరు కూడా వాగులో గల్లంతు అయ్యారు. కాగా సుంకరి సంపత్, కాలేవిని రమేష్ , మచ్చ రవిలు ప్రాణాలతో బయట పడ్డారు. గల్లంతైన వారి కోసం శ్రీరాంపూర్ సీఐ బిల్లా కోటేశ్వర్, ఆర్డీఓ రమేష్ ఆధ్వర్యంలో ముమ్మరంగా సింగరేణి రెస్క్యూ బృందం చర్యలు చేపట్టింది. మరోవైపు ఇటీవల కురిసన భారీ వర్షాలు కారణంగా వాగులో నీటి ప్రవాహం కూడా ఎక్కువగా ఉంది. పండగ అయిన మరుసటి రోజే ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.