బాడీ షేమింగ్.. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల విషయంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఏ ఒక్కరు కొంచెం లావు అయినా కొంచెం సన్నపడినా బాడీ షేమింగ్ పేరుతో విమర్శలు చేస్తుంటారు. అయితే అందరూ ఈ విమర్శలను పెద్దగా పట్టించుకోరు. కానీ కొంతమంది మాత్రం సీరియస్‌గా తీసుకొని ఇబ్బంది పడుతుంటారు. తాజాగా ‘మిస్ యూనివర్స్ 2021’ కీరిటాన్ని గెలుచుకున్న భారతీయ యువతి, మోడల్ హర్నజ్ సంధు బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న హర్నాజ్ ఈ విషయాన్ని పంచుకున్నారు.
తను బరువు పెరిగానంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయని తెలిపారు. కెరీర్ మొదట్లో చాలా సన్నగా ఉన్నారని, ఇప్పుడేమో లావుగా తయారయ్యారని వేధిస్తున్నట్లు తెలిపారు. అయితే ఆమె సెలియాక్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించారు. తను ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు ఎవరికీ తెలియదన్నారు. సెలియాక్ వ్యాధి వల్ల గోధుమ పింటి లాంటి ఇతన అనేక ఆహార పదార్థాలను తినలేనని తెలిపారు. అయితే తన శరీరంపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఎప్పుడూ నమ్మకంగా ఉంటానని , ఆత్మ విశ్వాసం సన్నగిల్లదని స్పష్టం చేశారు.