‘అఖండ 2’లో బాలీవుడ్ భామ ..ఎవరో తెలుసా..!

Bollywood actress in 'Akhanda 2'..Do you know who..!
Bollywood actress in 'Akhanda 2'..Do you know who..!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌ లో ‘అఖండ 2’ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే, ‘అఖండ 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు అంటూ బాలయ్య ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ స్క్రిప్ట్ పనుల్లో బోయపాటి చాలా బిజీగా ఉన్నాడు. ఐతే, స్క్రిప్ట్ దాదాపు ఫినిష్ కావడంతో, ప్రస్తుతం బోయపాటి నటీనటుల ఎంపిక పై కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది .

Bollywood actress in 'Akhanda 2'..Do you know who..!
Bollywood actress in ‘Akhanda 2’..Do you know who..!

ఇందులో భాగంగా.. పలువురు బాలీవుడ్ నటీనటులని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. ఆల్ రెడీ ‘అఖండ 2’ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటించబోతునట్లు వార్తలు వచ్చాయి. సంజయ్ దత్ తో పాటు తాజాగా కత్రినా కైఫ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోందని టాక్. గతంలో అల్లరి పిడుగు అనే మూవీ లో కత్రినా కైఫ్, బాలయ్య సరసన నటించింది. మళ్లీ దాదాపు 20 సంవత్సరాల తర్వాత ‘అఖండ 2’లో నటించబోతుంది అని అంటూ టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి. అన్నట్టు ఈ మూవీ పై బాలయ్య అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.