Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సల్మాన్ ఖాన్… అప్పట్లో సల్మాన్ ఖాన్ – ఐశ్వర్య రాయి లవ్ బర్డ్స్ …వీళ్ళిద్దరూ చెట్టాపట్టాలేసుకొని ఎక్కడపడితే అక్కడ తిరిగారు… పెళ్లి కూడా చేసుకుంటారు అనే వార్తలు కూడా వచ్చింది. కానీ ఏమైందో ఏమో తెలిదు గాని వాళ్ళిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఐశ్వర్య రాయి అభిషేక్ బచ్చన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం పెళ్లి చేసుకోలేదు. తర్వాత సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ తో ప్రేమ వ్యవహారం నడిపాడు. వీళ్ళిద్దరూ పెళ్లికి కూడా సిద్ధమవుతున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో ఏమోగాని కొన్ని రోజులకే ఇద్దరి మధ్య ఆ బంధం తెగిపోయిందని మరొక వార్త సంచలనం రేపింది.
ఇక ఆ తర్వాత సల్లు భాయ్ పెళ్లి – ప్రేమ అనే పదాలను పలకడానికి కూడా ఇష్టపడలేదు. ఆ తర్వాత కత్రినా కైఫ్ రణబీర్ కపూర్ తో పీకలలోతు ప్రేమలో పడింది. మళ్లీ వీరిద్దరూ కూడా విడిపోయారు. అయితే ఇలా ఎన్ని జరిగినా కూడా వారు నార్మల్ గానే సినిమాలను చేస్తూ వచ్చారు. సినిమా ఒప్పుకుంటే ఎవరి పాత్రకు వారు న్యాయం చేస్తూ వస్తున్నారు. అయితే ఈ మధ్య ఇద్దరు టైగర్ జిందా హై సినిమాతో మళ్లీ ఒకటయ్యారని వారి మధ్య మళ్లీ ప్రేమ చిగురిస్తాయి ఏమో అని కొన్ని కామెంట్స్ వినపడ్డాయి.
ఆ వార్తలు పై కత్రీనా ఓ చిత్ర ప్రమోషన్ లో కొంచెం ఘాటుగా స్పందించింది. నాకు సల్మాన్ కి ప్రేమ లేదని ,ఆ వార్తలో కొంచెం కూడా నిజం లేదని చెబుతోంది. తాము ఇప్పటికి మంచి స్నేహితులమని నా లైఫ్ లో సల్మాన్ చాలా స్పెషల్ అని , అంతే కాకుండా మా మధ్య ఎప్పుడు విభేదాలు రాలేదని కేవలం సినిమాల బిజీ షెడ్యూల్ వల్ల కలుసుకోవట్లేదని చెప్పింది. ప్రేమ అనే పదం మా ఇద్దరి మధ్యలో లేదు కేవలం స్నేహం మాత్రమే అని కత్రినా గట్టిగా చెప్పేసింది.