వామ్మో…. ఈ హీరోయిన్ కి అప్పుడే పెళ్లి అయిపోయిందా..?

malli-raava-heroine-akanksha-singh-is-married

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మన టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లు కంటే పరభాషా హీరోయిన్లు కే మన దర్శకనిర్మాతలు ప్రాముఖ్యతను ఇస్తుంటారు. మన టాలీవుడ్ లో చాలామంది పరభాషా హీరోయిన్లు టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆ కోవలోకి చెందిన ఒక అమ్మడు మన టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. సుమంత్ హీరోగా మళ్లీ రావా సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఆకాంక్ష సింగ్. మళ్లీ రావా సినిమా హిట్ అవ్వటంతో ఆకాంక్ష సింగ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారుతోంది.

మొన్నటి వరకు హిందీ సీరియల్స్ చేసిన ఈ అమ్మడు, ఇప్పుడు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆకాంక్ష సింగ్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల చెప్పింది. తాను టీనేజ్ లోనే ప్రేమలో పడ్డాను అని, 20 ఏళ్లకి ప్రేమించిన వ్యక్తినే వివాహం చేసుకున్నట్లు చెప్పింది. ఇప్పుడు ఆమె వయస్సు 27. తన భర్త సపోర్ట్ తోనే నటనలో శిక్షణను తీసుకొని హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చాను అంటూ తన వ్యక్తిగత విషయాలు గురించి ఆకాంక్ష సింగ్ వివరించింది. ఇప్పటి వరకు తమ కళల రాకుమారిగా ఊహించుకున్న యువకులు, ఈ విషయం తెలిసే సరికి మాడిపోయిన బల్బ మాదిరిగా తయారయ్యారు…