బాహుబ‌లిని వెన‌క్కి నెట్టి ఆస్కార్ బ‌రిలో నిలిచిన న్యూట‌న్

bollywood-movie-newton-is-i

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

భార‌త్ లో జ‌యాప‌జ‌యాలు తేల‌క‌ముందే… మ‌న‌దేశానికి చెందిన ఓ చిత్రం ఆస్కార్ బ‌రిలో నిలిచింది. రాజ‌కీయ వ్యంగ్య రూప‌కంగా తెర‌కెక్కిన న్యూట‌న్ అనే బాలీవుడ్  మూవీ విదేశీ చిత్రాల కేట‌గిరీలో ఆస్కార్ కు నామినేట్ అయింది.  దేశంలోని ఎన్నిక‌ల ప్ర‌క్రియలో  ఓ ఉద్యోగి తెచ్చిన మార్పేంటి అన్న నేప‌థ్యంలో  న్యూట‌న్ సినిమా సాగుతుంది. రాజ్ కుమార్ రావ్ ప్ర‌ధాన పాత్ర పోషించారు. తను న‌టించిన  సినిమా ఆస్కార్ అవార్డుకు పోటీప‌డుతుండ‌డంపై  ట్విట్ట‌ర్ లో ఆయ‌న ఆనందం వ్య‌క్తంచేశారు. న్యూట‌న్ చిత్రం భార‌త్ నుంచి ఈ ఏడాది ఆస్కార్ ఎంట్రీకి న‌మోదు కావ‌డం ఆనందంగా ఉందని చెప్తూ రాజ్ కుమార్ చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు చెప్పారు.
రాజ్ కుమార్ తో పాటు న్యూట‌న్ లో పంక‌జ్ త్రిపాఠి, అంజ‌లి పాటిల్, ర‌ఘుబిర్ యాద‌వ్ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో న‌టించారు. ఆస్కార్ కు నామినేట్ చేసే చిత్రాన్ని ఎంపిక చేయ‌టం కోసం  ఆస్కార్ ఇండియా జ్యూరీ చైర్మ‌న్ సి.వి.రెడ్డి, జ్యూరీలోని ఇత‌ర స‌భ్యులు మొత్తం 26 చిత్రాలు చూశారు. ఇందులో తెలుగు నుంచి బాహుబ‌లి 2, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాలు కూడా ఉన్నాయి. జాతీయ‌స్థాయిలో సంచ‌ల‌నం సృష్టించిన బాహుబ‌లి 2…అనేక రికార్డులు న‌మోదుచేసుకున్న‌ప్ప‌టికీ…ఆస్కార్ బ‌రిలో నిల‌వ‌లేక‌పోయింది. వైవిధ్య క‌థాంశంతో  తెర‌కెక్క‌డంతో జ్యూరీ స‌భ్యులు న్యూట‌న్ ను ఆస్కార్ కు నామినేట్ చేశారు. అమిత్. వి. మ‌సుర్క‌ర్ న్యూట‌న్ కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.