పాకిస్తాన్లో మంగళవారం ఉదయం జరిగిన బాంబు పేలుడులో 8 మంది చిన్నారులు మృతి చెందగా, 120 మంది గాయపడ్డారు. పెషావర్‌లోని డిర్ కాలనీలో ఒక మత పాఠశాల వద్ద ఉదయం ప్రార్ధనల అనంతరం ఈ ఘటన జరిగింది. పేలుడులో 4–5 కిలోల పేలుడు పదార్ధాలు వినియోగించినట్లు అధికారులు చెప్పారు.
పేలుళ్లను పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, ఖైబర్ పక్తున్‌క్వా ముఖ్యమంత్రి మెహ్మద్‌ఖాన్ ఖండించారు. పేలుడు జరిగినప్పుడు పాఠశాలలో దాదాపు 40–50 మంది చిన్నారులు ఉన్నట్లు తెలిసింది. పేలుడుకు ఏ ఉగ్ర సంస్థ బాధ్యత వహించలేదు.