మీర్‌పేట్‌లో పేలుడు కలకలం

మీర్‌పేట్‌లో పేలుడు కలకలం

మీర్‌పేట్‌లో చెత్త ఏరుకుంటున్న ఓ మహిళ డబ్బాను నేలకేసి కొట్టడంతో పేలుడు చోటు చేసుకుంది. మీర్‌పేట్‌  విజయపురి కాలనీలో పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో జరిగిన పేలుడు కలకలం సృష్టించింది.

చెత్త ఏరుకునే మహిళకు చెత్తకుప్ప సమీపంలో డబ్బా దొరకగా డబ్బాను తెరిచేందుకు ప్రయత్నించింది. డబ్బా తెరుచుకోక పోవడంతో నేలకేసి కొట్టగా పేలుడు సంభవించింది. పేలుడు వలన చెత్త ఏరకునే మహిళక తీవ్ర గాయాల పాలైంది. వెంటనే ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరకుని డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. ఘటన స్థలానికి బాంబ్‌ స్కాడ్‌ కూడా చేరుకుంది. వివరాల కొరకి క్లూస్‌ టీమ్‌కు పోలీసులు అప్పగించగా పేలుడుకు గల కారణాలపై విచారణ చేపట్టారు.