జేమ్స్‌బాండ్‌లో ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్

జేమ్స్‌బాండ్‌ చిత్రాల సిరీస్‌లో రాధికా

జేమ్స్‌ బాండ్‌ చిత్రాల సిరీస్‌లో రానున్న కొత్త చిత్రానికి రాధికా ఆప్టేకి పిలుపు వచ్చింది. ఈ జేమ్స్‌ బాండ్‌ సినిమాలో ఒక పాత్ర కోసం ఆడిషన్స్‌ ఇవ్వమని రాధికా ఆప్టేకి కబురు రాగా.. రాధికాఆప్టే లుక్, నటనను రికార్డ్‌ చేసి చిత్ర యూనిట్ పంపించగా రాధికాకి ఆఫర్‌ వచ్చింది. దీనితో పాటు రాధికా ఆప్టేకు స్టార్‌ వార్స్‌ ఆఫర్‌ కూడా వచ్చింది.

చిన్నాపెద్దా లేకుండా అందరికీ బాండ్‌ సినిమాలు అంటే క్రేజ్ ఉంటుంది. అలాంటి జేమ్స్‌ బాండ్‌ చిత్రాల సిరీస్‌లో రానున్న కొత్త సినిమాకి రాధికా ఆప్టేకి ఆఫర్‌ వచ్చింది. ఈ సందర్భంగా రాధికా ఆప్టే మాట్లాడుతూ ఈ పలాన పాత్రను ఈ ఆర్టిస్టే చేయాలని అని కాకుండా నాలాంటి ఆర్టిస్టులకి కూడా అవకావం ఇవ్వడం సంతోషించ దగ్గ విషయం అని చెప్పారు.

రాధికా ఇచ్చిన ఆడిషన్‌ నచ్చితే బాండ్‌ సినిమాలోనూ, స్టార్‌వార్స్‌ సినిమాలోనూ  కనిపించ నున్నారు. హోమ్లీగా ఇంకా గ్లామర్‌ పాత్రలలో హాట్‌గా పాత్రకు తగ్గట్టు నటన కనబరిచే రాధికాకి హాలీవుడ్‌ సంస్థ తిరస్కరించే అవకాశాలు చాలా తక్కువే.