నెగెటివ్‌ వార్తలని తిప్పికొట్టిన యాంకర్‌

నెగెటివ్‌ వార్తలని తిప్పికొట్టిన యాంకర్‌

కొద్ది రోజులుగా టీవీ యాంకర్‌ ప్రదీప్‌ ఆరోగ్యం బాలేదన్న వార్తలు సోషల్‌ మీడియాలో వినిపిస్తుండగా, ఈ వార్తలపై ప్రదీప్‌ స్పందించాడు. ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలు రూమర్స్‌ అంటూ తేల్చి చెప్పేశాడు.

కొద్ది రోజులుగా షూటింగ్‌లకు యాంకర్‌ ప్రదీప్‌ హాజరు అవ్వక పోవడంతో నెల రోజుల పాటు ఎలాంటి ఈవెంట్‌లో కనిపించక పోయేసరికి రకరకాల వార్తలు వినిపించాయి. ఏదో ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో సందడి చేసే ప్రదీప్‌ ఏకంగా నెల రోజుల పాటు ఎలాంటి షో లో రాలేదు.

యాక్సిడెంట్‌ అయ్యిందని ఆరోగ్య పరిస్థితి బాలేదని వచ్చిన వార్తలపై తాజాగా ప్రదీప్‌ స్పందించాడు. లైవ్‌లో తన సోషల్ మీడియా పేజ్‌ అభిమానులతో మాట్లాడాడు. పుకార్లపై క్లారిటీ ఇస్తూ తన గురించి ఆలోచించి మెసేజ్‌లు, ఫోన్లు చేసిన వారికి థాంక్స్ చెప్పాడు.ఎలాంటి ప్రమాదానికి ప్రదీప్ గురికాలేదు.

షూటింగ్‌లో జరిగిన చిన్న సంఘటనలో ప్రదీప్‌ కాలికి గాయం అవ్వగా రెస్ట్ తీస్కోవాలసి వచ్చింది. నెల రోజుల రెస్ట్ కొరకి ప్రదీప్‌ షూటింగ్‌లకు బ్రేక్‌ ఇవ్వాల్సి వచ్చింది. పూర్తిగా కోలుకున్న ప్రదీప్‌ వారం రోజుల్లో షూటింగ్‌లకు హాజరవుతానని తెలిపాడు..