సినిమాలకు గ్యాప్ తీసుకోబోనున్న సమంత

సినిమాలకు గ్యాప్ తీసుకోబోనున్న సమంత

పెళ్లితర్వాత కూడా క్రేజీ హీరోయిన్ సమంతకు అవకాశాలు ఏమాత్రం తగ్గలేదు. అక్కినేని ఫ్యామిలీ కోడలిగా వచ్చాక తన ఫాలోయింగ్ సినిమా అవకాశాలు అలాగే ఉన్నాయి.

సమంత మజిలీ, ఓ బేబీ సినిమాలతో సక్సెస్ అందుకుంది. తమిళ సూపర్ హిట్ మూవీ 96 రీమేక్ లోఇంకా అమేజాన్ ప్రైం నిర్మిస్తున్న ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ సీక్వల్లో ప్రస్తుతం నటిస్తుంది. తర్వాత సినిమాలకు గ్యాప్ తీసుకునే ఆలోచనలో ఉందట సమంత.

హెల్త్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉండే సమంత పిల్లలు కనేందుకు జాగ్రత్తలు తీసుకుంటుంది. దీనివల్ల సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది. పిల్లలంటే సమంతకు చాలా ఇష్టం. పిల్లల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ తల్లి అయ్యేందుకు ఆరాట పడుతుందట.