“డిస్కోరాజా”గా రవితేజ

అంచెలంచెలుగా ఎదిగి మాస్ మాహా రాజాగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న రవితేజ పుట్టిన రోజు కానుకగా జనవరి 24న “డిస్కో రాజా” విడుదలకి కానుంది. మొదట్లో చిన్న చిన్న వేషాలు వేసినా గుర్తింపు రాక దర్శకుడు కృష్ణ వంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. కృష్ణవంశీ తీసిన సింధూరంలో సెకండ్ హీరోగా చేసాడు.  శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన నీకోసం సినిమాలో రవితేజ హీరోగా తెరంగరేటమ్ చేసి ఆయన నటనకు పలువురి ప్రశంసలు పొందారు.

హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సూపర్ హిట్ అయి హీరోగా గుర్తింపు వచ్చింది. ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, డాన్ సీను, కిక్, విక్రమార్కుడు, కృష్ణ, వెంకీ, భద్ర, బలాదూర్,బలుపు,పవర్, దరువు, దుబాయ్ శీను, నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఇట్లు శ్రావణి సుభ్రమణ్యం, లాంటి పెద్ద పెద్ద విజయాలతో తెలుగు చలన చిత్ర ఇండస్ట్రీలో రవితేజ ముఖ్య స్థానంలో ఉన్నారు.

ఇపుడు డిస్కో రాజా చిత్రంలో నటిస్తున్నారు. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పార్ట్ ఎక్కువుగా ఉండి, మంచి క్వాలిటీ అవుట్ పుట్ ఉండేలా  డిస్కో రాజాను జనవరి 24కి విడుదల చేస్తున్నామని నిర్మాత రామ్ తళ్లూరి తెలిపారు. వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రానున్న డిస్కో రాజా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ డిసెంబర్ మొదటి వారంలో ముగియనుంది.