రద్దు కానున్న పెద్దనోటు

రద్దు కానున్న పెద్దనోటు

నల్ల ధనం వెలికితీత, నకిలీ కరెన్సీని అడ్డుకోవడం కొరకి మోదీ ప్రభుత్వం చేసిన 500, 1000 నోట్ల రద్దుకు ఇవాటికి సరిగా మూడేళ్లు. ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఎస్‌.సి.గార్గ్‌ 2000 నోటును కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ వేగంగా ఉన్న తరుణంలో భారత్‌లో మాత్రం నెమ్మదిగా సాగుతోంది అని చెప్పారు.

చెలామణిలో ఉన్న 2000నోట్లలో మూడోవంతు ఉన్నాయని రోజువారీ లావా దేవీలకు ప్రజలకు అందు బాటులో ఉండడం లేదని తెలియ చేశారు. దీనివల్ల రద్దు చేయాల్సిన అవసరం ఆయన అభిప్రాయం తెలిపారు. అనేక డిజిటల్‌ సాధనాలు ఆర్థిక లావాదేవీలకు అందు బాటులోకి వచ్చాయని కానీ భారత్‌లో ఇంకా 85శాతం నగదు ఆధారిత చెల్లింపులే జరగుతున్నాయని చెప్పారు.

డిజిటల్‌ చెల్లింపుల్ని మరింత సులభతరం చేస్తూ తద్వారా నగదు ఆధారిత చెల్లింపులు ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి ప్రజలని డిజిటల్‌ వైపు సేవలు వినియోగించుకునేల చేయాలని తెలియ చేశారు.