“చలో ట్యాంక్‌బండ్‌”అనుమతికి నిరాకరణ

అఖిల పక్ష నేతలు కలిసి చలో ట్యాంక్‌ బండ్‌కి అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కోరగా పోలీసులు అనుమతి ఇవ్వ లేదు. హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ ఈ కార్యక్రమానికి నిరాకరించారు.ఈ ఆందోళన కార్యక్రమానికి అనుమతి ఇచ్చేదని లేదని సీపీ అంజనీకుమార్‌ తేల్చి చెప్పేశారు. ముందస్తుగానే పోలీసులు పలు ప్రాంతాల్లో ఆర్టీసీ ఐకాస నేతలు, కార్మికులను అరెస్టులు చేస్తున్నారు.

ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ కార్మిక నాయకులు, కార్మికులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని చెప్పారు. హయత్‌నగర్‌లో నిర్వహించిన ఆర్టీసీ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాదుతూ ఆర్టీసీ కార్మికుల ఇళ్లలోకి చొరబడి  దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని నిర్బంధాలు, ఇబ్బందులు ఎదురైనా ‘చలో ట్యాంక్‌ బండ్‌’ కార్యక్రమం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. కార్మికులు బెదిరింపులకు భయపడాల్సిన పనిలేదని, ఇవాళ రాత్రికి కార్మికులు హైదరాబాద్‌కు చేరుకోవలసిందిగా పిలుపునిచ్చారు.