ఈఫిల్‌ టవర్‌ కు బాంబు బెదిరింపు కాల్..!

Bomb threat call to Eiffel Tower..!
Bomb threat call to Eiffel Tower..!

పారిస్‌లోని ఈఫిల్ టవర్ కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రసిద్ధ సందర్శనీయ ప్రదేశమైన ఈఫిల్‌ టవర్‌ లో బాంబు ఉన్నట్లు శనివారం బెదిరింపు ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈఫిల్‌ టవర్‌ మూడు అంతస్తుల్లో ఉన్న సందర్శకులను,రెస్టారెంట్‌లోని వారిని కూడా అక్కడి నుంచి ఫ్రాన్స్‌ పోలీసులు ఖాళీ చేయించారు.

బాంబు బెదిరింపు నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం నుంచి సందర్శకులను అనుమతించలేదు. కాగా, ఈఫిల్‌ టవర్‌ ను 1887లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 1889 మార్చి 31న దీని నిర్మాణం పూర్తయ్యింది. ఆ ఏడాదిలో ఫ్రాన్స్‌లో జరిగిన వరల్డ్ ఫెయిర్ సందర్భంగా ఈఫిల్‌ టవర్‌ను సుమారు 20 లక్షల మంది సందర్శించారు.గత సంవత్సరంలో 62 లక్షల మంది దీనిని చూసేందుకు వెళ్లారు.