కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ కలకలం రేపింది. దీంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. చర్లపల్లి రైల్వేస్టేషన్లో ట్రైన్‌ను అధికారులు నిలిపివేశారు. స్థానిక పోలీసులు, బాంబ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఫేక్ కాల్‌గా రైల్వే పోలీసులు తేల్చారు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ భువనేశ్వర్ నుంచి ముంబైకు వెళ్తోంది. బాంబు బెదిరింపు కాల్‌తో ట్రైన్ లో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.