మీకు రోగ నిరోదక శక్తి తక్కువగా ఉందా?

మీకు రోగ నిరోదక శక్తి తక్కువగా ఉందా?

కరోనా ఇప్పుడిప్పుడే తోక ముడిచే సూచనలేం కనిపించటం లేదు. దీన్నించి మనని మనం కాపాడుకునే మార్గాల్లో ఇమ్యూనిటీని పెంచుకోవడం కూడా ఒకటి. అందుకు చాలా మార్గాలున్నాయి. వాటిలో ఒకటి తాజా కూరగాయల మీద, వంటింట్లో లభించే స్పైసెస్, హెర్బ్స్ మీద డిపెండ్ అవ్వడం ఒకటి. ఇవి న్యూట్రియెంట్స్ తో నిండి ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఇమ్యూనిటీ మన సిస్టమ్ లో నుండి ఫారిన్ బాడీలని రిమూవ్ చేయటమే కాక బ్యాక్టీరియా, వైరస్ నుండి మనని ప్రొటెక్ట్ చేస్తుంది. అయితే, ఇమ్యూనిటీ అనేది నెమ్మదిగా పెరుగుతుంది. అంటే, మనం రెగ్యులర్ గా ఇమ్యూనిటీని బూస్ట్ చేసే ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలే తప్ప ఇన్స్టంట్ రిజల్ట్స్ ఇందులో కనిపించవు. ఇక్కడ ఉన్న రెసిపీస్ ని చూడండి. రుచి కి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం.

  • అల్లం, ఉసిరి, పసుపు తురమండి.ఈ తురుముని నీటితో కలిపి వడకట్టండి. మళ్ళీ ఇంకొంచెం నీరు పోసి కలిపి వడకట్టండి.ఇలా మూడు నాలుగు సార్లు చేయండి.ఇలా చేస్తే మీకు షుమారుగా ఒక లీటర్ పానీయం వస్తుంది. ఈ పానీయం ఫ్రిజ్ లో వారం వరకూ నిల్వ ఉంటుంది. ఇది ఎలాగా నీటితో కలిసినదే కాబట్టి అలా తాగేయవచ్చు. చిన్న షాట్ గ్లాసుల్లో ఈ పానీయాన్ని తీసుకోవచ్చు.
  • ఒక కప్పు వేడి నిటీలో దాలిచిన చెక్క వేసి ఒక నిమిషం సిం లో ఉంచండి. వేడి నీరు మాత్రమే, మరుగుతున్న నీరు కాదని గుర్తుంచుకోండి.అల్లాన్ని ముక్కలు చేసి ఇందులో కలపండి.రెండు నిమిషాలు ఆగి వడకట్టండి.మిరియాల పొడి వేసి తాగేయండి.
  • వేడి నీటిలో జీల కర్ర వేయండి.రెండు నిమిషాలు ఆగి చిన్నగా ముక్కలు చేసిన వెల్లుల్లిని కలిపి పదిహేను నిమిషాలు ఉంచండి. తేనె కలిపి తీసుకోండి.