ఇక మహేష్‌ జాతకం తేలాల్సి ఉంది..!

Box Office war between Spyder Movie and Jai lava kusa movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఈ దసరాకు ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తేందుకు ఎన్టీఆర్‌, మహేష్‌బాఋ రాబోతున్నట్లుగా రెండు మూడు నెలలుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఈ దసరా రేసులో గెలిచేది ఎవరు, నిలిచేది ఎవరు అంటూ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు. దసరా రేసులో ముందు వచ్చిన ఎన్టీఆర్‌ తన ‘జైలవకుశ’ చిత్రంతో అద్బుతాన్ని ఆవిష్కరించాడు. తన నటన ప్రతిభతో, నట విశ్వరూపాన్ని జైలవకుశలో చూపించి ప్రేక్షకుల ప్రశంసలు పొందుతున్నాడు. పాజిటివ్‌ టాక్‌ రావడంతో దసరా హాలీడేస్‌ను జైలవకుశ చిత్రంతో ఎంజాయ్‌ చేయాలని ప్రేక్షకులు భావిస్తున్నారు.

జైలవకుశ విడుదల తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ‘స్పైడర్‌’ చిత్రంపై ఉంది. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన స్పైడర్‌ చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మహేష్‌బాబు కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. 120 కోట్ల బడ్జెట్‌తో తమిళ దర్శకుడు మురుగదాస్‌ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో ఒకేసారి విడుదల కాబోతుంది. ఎస్‌జే సూర్య విలన్‌గా చేయడంతో పాటు మహేష్‌బాబు కొత్త లుక్‌తో కనిపిస్తున్న నేపథ్యంలో సినిమా జైలవకుశను మించి ఉంటుందని మొదటి నుండి ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ మరియు టీజర్‌, పాటలు సినిమా స్థాయిని అమాంతం పెంచాయి. మరి ప్రేక్షకును జైలవకుశ నుండి స్పైడర్‌ వైపుకు మహేష్‌బాబు నడిపించగలడా అనేది విడుదలయిన తర్వాత తేలిపోనుంది.