మ‌ణిర‌త్నం సినిమాలో అర్జున్ రెడ్డి హీరో

Vijay Devarakonda to act in Mani Ratnam direction

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అర్జున్ రెడ్డి సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫేట్ మారిపోయింది. విజ‌య్ అర్జున్ రెడ్డి క్యారెక్ట‌ర్ లో న‌టించ‌డం కాదు… జీవించేశాడు అని విమ‌ర్శ‌కులు సైతం అంగీక‌రించారు. ఈ సినిమా త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి. తాజాగా ఆయ‌న‌కు… ఎంతోమంది హీరోల డ్రీమ్ డైరెక్ట‌ర్ అయిన మ‌ణిర‌త్నం సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం మ‌ణిర‌త్నం ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ తెర‌కెక్కించే ప్ర‌య‌త్నంలో ఉన్నారు.

ఈ సినిమాలో శింబు, విజ‌య్ సేతుప‌తి, ఫాహ‌ద్ ఫాజిల్, జ్యోతిక‌, ఐశ్వ‌ర్య రాజేశ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. తొలుత విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఈ సినిమాలోనే ఓ హీరోగా అవ‌కాశం వ‌చ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. అయితే అది నిజం కాద‌ని త‌ర్వాత తేలింది. మ‌ల్టీస్టార‌ర్ మూవీ త‌ర్వాత మ‌ణిర‌త్నం ఓ ల‌వ్ స్టోరీని తీయాల‌ని భావిస్తున్నారు. అందులో హీరోగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఎంపిక‌చేసుకున్న‌ట్టు స‌మాచారం. అర్జున్ రెడ్డి సినిమా చూసిన ఈ వెట‌రన్ డైరెక్ట‌ర్ కు విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న బాగా న‌చ్చ‌టంతో ఆయ‌న‌కు అవ‌కాశ‌మిస్తున్నారు.