ప్రేమలో పడ్డ ప్రతి జంట పెళ్లి చేసుకుంటారన్న గ్యారంటీ లేదు. ప్రేమను పెళ్లితో మూడిపెట్టేవారు చాలా తక్కువ ఉంటారు. ఎంత గాఢంగా ప్రేమించుకున్న కొన్ని కొన్ని కారణాలతో మధ్యలోనే బ్రేకప్ చెప్పేసి ప్యాకప్ అయ్యేవారే ఎక్కువ ఉన్నారు. బ్రేకప్ తర్వాత గతానికి స్వస్తి పలికి వెంటనే కొత్త జీవితాన్ని ప్రారంభించేవారు కొందరైతే గతాన్నే తలుచుకొని కుమిలికుమిలి బాధపడేవారు మరికొందరు. అయితే ఈ రెండు కోవలకు చెందిన వారికంటే విరుద్ధంగా విడిపోయాక లవర్‌పై కోపంతో రీవెంజ్ తీసుకునేవారు కూడా ఉంటారు. తాజాగా లవర్ బ్రేకప్ చెప్పిందని ఓ యువకుడు వీరంగం సృష్టించాడు.
కర్ణాటకకు చెందిన సతీష్(26) అనే యువకుడు, ఓ యువతిని గత కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. అయితే ఏమయ్యిందో తెలీదు కానీ ఇటీవల ఆమె సతీష్‌కు బ్రేకప్ చెప్పింది. లవర్ బ్రేకప్ చెప్పడాన్ని తట్టుకోలేకపోయిన అతడు ఆవేశంతో రగిలిపోయాడు. బెంగళూరులోని రోడ్లపై కనిపించిన ఏడు కార్లను ధ్వంసం చేశాడు. గురువారం అర్ధరాత్రి 1.30 -.45 మధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. కార్లను ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సుమారు ఇలాంటి ఘటనే గత ఫిబ్రవరిలోనూ చోటుచేసుకుంది. లవర్ బ్రేకప్ చెప్పిందని ఆమె టూవీలర్‌ను మంటల్లో తగలబెట్టాడు. అంతేగాక ఆమెను చంపేస్తానంటూ బెదిరింపులకు గురిచేశాడు.