జిల్లాలోని కంచికచెర్ల మండలం పరిటాలలో విషాదం చోటుచేసుకుంది. పేకాట ఆడుతూ పట్టుబడిన ఓ యువకుడు అవమాన భారంతో ప్రాణాలు తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం పేకాట ఆడుతూ రాజశేఖర్రెడ్డి అనే యువకుడు పట్టుబడ్డాడు. విషయం అందరికీ తెలిసిపోవటంతో మనస్తాపం చెందిన రాజశేఖర్రెడ్డి నిన్న రాత్రి కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కుమారుడి మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా, సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టాడని పోలీసులు కొట్టడం వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని తల్లి ఆరోపించారు. మరోవైపు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామే తప్ప కొట్టలేదంటున్న పోలీసులు చెప్తున్నారు.