ప్రియురాలి బంధువులు, పోలీసుల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం పార్వతీపురం మండలం వెంకటరాయుడు పేటలో చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటరాయుడు పేటకు చెందిన మంత్రపుడి సురేష్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియటంతో వారు అతడి కక్ష గట్టారు. ప్రియురాలి బంధువులు.. పోలీసులతో కుమ్మక్కై సురేష్‌పై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారు. దీంతో మనస్తాపం చెందిన సురేష్ ఆత్మహత్య యత్నించాడు.