ఆడుకుందామని పిలిచి ఐదేళ్ల చిన్నారిపై పద్నాగేళ్ల బాలుడు లైంగిక దాడికిపాల్పడిన సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని సూరారం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
చిన్నారిని ఇంటికి తీసుకెళ్లిన బాలుడు లైంగికదాడికి పాల్పడగా చిన్నారి కేకలు వేయడంతో పక్క ఇంటిలోఉన్న చిన్నారి తల్లి పరుగున వచ్చి బాలుడిని మందలించింది.
చిన్నారి తల్లిదండ్రులు చిన్నశంకరంపేట పోలీస్లను ఆశ్రయించారు. పాపను మెదక్ ఏరియా ఆస్పత్రికి వైద్య పరీక్షలకు పంపించినట్లు పోలీస్లు తెలిపారు. కాగా బాలుడు పరారీలో ఉన్నాడని తెలిసింది.