మైత్ర్హికి అడ్వాన్స్ ఎందుకు తిరిగిచ్చినట్టు ?

Boyapati Pays Back Advance To Mythri Movie Makers

తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథను తీసుకుని ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అనే రెండు సినిమాలను స్వీయ నిర్మాణంలో తానే నటిస్తూ బాలకృష్ణ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే అనుకున్నంత స్థాయిలో రెండు సినిమాలు ఆడలేదు. దీంతో ఇప్పుడు బాలకృష్ణ మరోసారి తానే నిర్మాతగా మరో సినిమా తీసేందుకు సిద్ధం అవుతున్నారు. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాలు తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ తన తర్వాతి సినిమాను తీస్తున్నారు. రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాతో డిజాస్టర్ అందుకున్న బోయపాటి బాలకృష్ణ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ వంటి రెండు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.

ఇప్పుడు తీయబోయే సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని ఇద్దరూ పట్టుదలగా ఉన్నారు. ఈ సినిమాను ఇప్పటికే ఎన్నికల తర్వాత సెట్స్ పైకి తీసుకుని వెళ్తానంటూ బాలకృష్ణ ప్రకటించగా ఎన్ బీకే ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ క్రమంలో మైత్రి మూవీస్ సంస్థతో బోయపాటి ఓ చిత్రం చేయవలసి ఉండగా తీసుకున్న అడ్వాన్స్ ను కూడా బోయపాటి మైత్రీ మూవీ మేకర్స్ కు తిరిగి ఇచ్చేశారట. బాలకృష్ణ, బోయపాటి సినిమాను బాలకృష్ణే స్వయంగా నిర్మిస్తానని చెప్పడంతో బోయపాటి అడ్వాన్స్ ను మైత్రీ మూవీ మేకర్స్ కు తిరిగి ఇచ్చేసినట్లు తెలుస్తుంది.