మెగా తర్వాత నందమూరి, అక్కినేని..!

balakrishna

యాక్షన్‌ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం రామ్‌ చరణ్‌ హీరోగా ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ చిత్రం వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నారు. సంక్రాంతికి సినిమాను విడుదల చేయబోతున్నారు. చరణ్‌తో మూవీ పూర్తి అయిన వెంటనే బాలకృష్ణతో బోయపాటి మూవీ ఉంటుందని గత ఆరు నెలలుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ విషయమై క్లారిటీ కూడా వచ్చేసింది. బాలకృష్ణతో తన తదుపరి చిత్రం వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభం కాబోతుందని బోయపాటి ప్రకటించాడు. బోయపాటి ఆ తదుపరి చిత్రం పై కూడా ఒక క్లారిటీ వచ్చేసింది.

ప్రస్తుతం మెగా హీరో రామ్‌ చరణ్‌తో సినిమాను చేస్తున్న బోయపాటి ఆ తర్వాత నందమూరి హీరో బాలకృష్ణతో సినిమాకు స్క్రిప్ట్‌ను కూడా సిద్దం చేసి పెట్టాడు. బాలయ్యతో మూవీ తర్వాత అక్కినేని హీరో అఖిల్‌తో సినిమాకు బోయపాటి అడ్వాన్స్‌ను తీసుకున్నట్లుగా సినీ వర్గాల్లో పుకార్లు చేస్తున్నాయి. వచ్చే ఏడాది చివర్లో అఖిల్‌తో బోయపాటి మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది. 2020లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత బోయపాటి మరియు అఖిల్‌ల మూవీకి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి మెగా, నందమూరి, అక్కినేని ఫ్యామిలీలకు చెందిన హీరోలతో వరుసగా చిత్రాలను చేస్తూ టాప్‌ దర్శకుల్లో ఏ ఒక్కరికి దక్కని ఛాన్స్‌ను బోయపాటి దక్కించుకుంటున్నాడు.

balakrishna and boyapati