చరణ్‌ తర్వాత బాలయ్యతో బోయపాటి

boyapati--srinu-next-movie-

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మాస్‌ చిత్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అంటూ పేరు తెచ్చుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను ఇటీవలే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ‘జయ జానకి నాయక’ అనే చిత్రాన్ని చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా రామ్‌ చరణ్‌తో ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఇటీవలే చరణ్‌, బోయపాటిల కాంబో మూవీ పూజా కార్యక్రమాలు జరిగాయి. వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో చిత్రీకరణ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుతున్న బోయపాటి శ్రీను తర్వాత సినిమాను కూడా ఖరారు చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.

boyapati--srinu

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బోయపాటి తర్వాత సినిమా బాలకృష్ణతో ఉండబోతుంది. ఇప్పటికే ‘సింహా’ మరియు ‘లెజెండ్‌’ చిత్రాలను చేసిన వీరిద్దరు గత సంవత్సరంలోనే మరో సినిమాను చేయాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల అది కాస్త వాయిదా వేస్తూ వచ్చారు. బాలయ్య 100వ చిత్రాన్ని బోయపాటి దర్శకత్వంలో చేయాలని భావించారు. కాని గౌతమిపుత్ర శాతకర్ణి చేస్తే 100వ సినిమాకు మంచి అర్థం ఉంటుందనే ఉద్దేశ్యంతో బోయపాటిని సైడ్‌ చేశాడు.

 boyapati-

తాజాగా బాలయ్యకు బోయపాటి ఒక స్టోరీ లైన్‌ చెప్పడం, ఆ స్టోరీకి బాలయ్య వెంటనే ఓకే చెప్పడం జరిగింది. వచ్చే సంవత్సరం ద్వితీయార్థంలో బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ చిత్రంలో మహేష్‌బాబు కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలపై స్పష్టత రావాల్సి ఉంది.