కొండప్రాంత ప్రజల తీవ్ర ఇబ్బందులు

కొండప్రాంత ప్రజల తీవ్ర ఇబ్బందులు

భీకర వర్షాలతో బ్రెజిల్‌ దేశంలోని రియో డీ జనీరియో రాష్ట్రంలో కొండప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని పెట్రోపోలిస్‌ ప్రాంతంలో వర్షాలకు కొండల నుంచి భారీ స్థాయిలో బురదచరియలు కిందనున్న జనావాసాలపై పడ్డాయి. దీంతో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పెట్రోపోలిస్‌ మేయర్‌ రూబెన్స్‌ చెప్పారు. జనావాసాలను బురద ముంచెత్తింది.

అందులోని 21 మందిని కాపాడారు.ఇదే ప్రాంతంలో 11 ఏళ్ల క్రితం భారీ వర్షాల ధాటికి వందల మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిశాయి. వరదలు, బురద చరియలు పడిన ప్రాంతంలో 180కి పైగా జవాన్లు అవిశ్రాంతంగా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని పెట్రోపోలిస్‌ రాష్ట్ర అగ్నిమాపక విభాగం తెలిపింది. స్థానికులు సైతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.