పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. లోక్సభ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. తొలి విడుదల 21 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో 102 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. నేటి నుంచి ఈనెల 27వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అలాగే ఈనెల 28వ తేదీన నామినేషన్ల పరిశీలన కూడా ఉండనుంది.
ఈనెల 30వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. ఏప్రిల్ 19వ తేదీన పోలింగ్ మరియు జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అటు రెండు తెలుగు రాష్ట్రాలు అయినా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మీ 13న పోలింగ్ జరగనుంది.