Breaking News: పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించాలని ఇండియా కూటమి నిర్ణయం

Breaking News: India alliance's decision to boycott Parliament sessions
Breaking News: India alliance's decision to boycott Parliament sessions

పార్లమెంట్ సమావేశాల ఇండియా కూటమి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించాలని ఇండియా కూటమి పక్షాల కూటమి నిర్ణయం తీసుకుంది. ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా ఇండియా కూటమి పక్షాల కూటమి ఈ నిర్ణయం తీసుకుంది. మల్లికార్జున ఖర్గే ఛాంబర్ లో భేటీ అయిన ఇండియా కూటమి పక్షాల ఫ్లోర్ లీడర్లు…ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాగా, ఇవాళ ఇండియా కూటమి కీలక భేటీ కానుంది. ఢిల్లీలోని అశోక హోటల్‌లో మధ్యాహ్నం 3గంటలకు సమావేశం జరుగనుంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి భేటీ కాబోతుంది. గతంలో 3 సార్లు (పాట్నా, బెంగళూరు, ముంబై) సమావేశమైన ఇండియా కూటమి.. ఢిల్లీలోని అశోక హోటల్‌లో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరుగనుంది. ఇండియా కూటమి కీలక భేటీ అజెండాలో సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ప్రచారమ్ ,ప్రణాళిక ప్రధానాంశాలు ఉన్నాయి.