మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు అందించాలని నిర్ణయం తీసుకుంది. 15వేల స్వయం సహాయక బృందాలకు 2023-24 నుంచి 2025-26 మధ్య కాలంలో డ్రోన్లు ఇవ్వనున్నారు. రైతులకు అద్దె పద్ధతిలో డ్రోన్లను అందించి ఉపాధి పొందేలా స్కీమును కేంద్రం ప్రవేశపెట్టనుంది.ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,261 కోట్లను కేటాయించింది. విక్షిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా స్వయం సహాయక బృందాలతో ప్రధాని నరేంద్ర మోడీ రేపు గురువారం ఇంటరాక్ట్ అవుతారని PMO కార్యాలయము ఓ ప్రకటనలో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో టెక్నాలజీని ప్రోత్సహించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ పథకంతో పాటు జెన్ ఔషధీ కేంద్రాల సంఖ్యను పదివేల నుంచి 25 వేలకు పెంచనున్నట్టు ప్రధాన కార్యాలయం తెలిపింది. మహిళలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడంతో పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.