Breaking News: రుణమాఫీపై కీలక తమిళిసై ప్రకటన

Breaking News: Key Tamilisai announcement on loan waiver
Breaking News: Key Tamilisai announcement on loan waiver

రుణమాఫీపై కీలక తమిళిసై ప్రకటన చేశారు. రూ.2 లక్షల పంట రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుందని గవర్నర్ తమిళిసై అసెంబ్లీలో ప్రకటించారు. “ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తాం. భూమాత పోర్టల్ అత్యంత పారదర్శకంగా ఉంటుంది.

అప్పులతో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేశారు. దుబారా ఎక్కడ జరిగిందో కనిపెట్టే పనిలో ఉన్నాం” అని తెలిపారు. అణచివేత, అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహించరని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. అసెంబ్లీలో ప్రసంగిస్తూ “ప్రజావాణి కార్యక్రమంతో కొత్త ప్రభుత్వం ముందుకెళ్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైంది. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. రాచరికం నుంచి తెలంగాణ విముక్తి పొందింది. కొత్త సీఎం రేవంత్ రెడ్డి తాము ప్రజా పాలకూలం కాదు, ప్రజాసేవకులం అని చెప్పారు” అని వాక్యానించారు.