రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ముహూర్తంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. రేపు మ. 1. 04 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. వాస్తవానికి రేపు ఉదయం 10 గంటల సమయంలో ప్రమాణస్వీకారం చేయాలి. కానీ రేపు మ. 1. 04 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు రేవంత్ రెడ్డి. ఇక ఆ కార్యక్రమానికి హాజరుకావాలని ఏఐసీసీ నేతలకు, ఇతర రాష్ట్రాల నేతలకు ఆహ్వానం పంపారు.
మల్లిఖార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక, ఏఐసీసీ నేతలకు ఆహ్వానం పంపారు. కర్ణాటక సీఎం సిద్దిరామయ్య, డిప్యూటీ సీఎం డీకేశివకుమార్, కర్ణాటక రాష్ట్ర మంత్రులకు ఆహ్వానం పంపారు. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్, ఛతీస్ ఘడ్ మాజీ సీఎం భూపేష్ బఘెల్, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహన్…గతంలో ఇంచార్జిలుగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్, వీరప్ప మోహిలి, కుంతియా, వాయిలార్ రవి, మాణిక్కం ఠాగూర్, మరికొందరు ముఖ్యులు ఈ కార్యక్రమానికి రానున్నారు. తెలంగాణ ఏర్పాటు కీలక పాత్ర పోషించిన చిదంబరం, కురియన్, మీరాకుమారి, సుశీల్ కుమార్ షిండే, మరికొందరు నేతలకు ఆహ్వానం పంపారు.