Breaking News: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

Breaking News: Telangana assembly meetings begin
Breaking News: Telangana assembly meetings begin

Breaking News: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. పది నిమిషాలు ఆలస్యంగా అసెంబ్లీ ప్రారంభం అయింది. వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ పది నిమిషాలు ఆలస్యంగా అసెంబ్లీ ప్రారంభం అయింది. ఇక తెలంగాణ అసెంబ్లీ ప్రొటెమ్ స్పీకర్ గా ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ కొనసాగుతున్నారు.

ఇక అంతకు ముందు… కార్యకర్తలకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని ప్రకటించారు తెలంగాణ సీఎం రేవంత్‌. శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం తెలంగాణ ప్రజలకు ఒక పండుగ అని.. డిసెంబర్ 9, 2009లో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని ఉక్కు సంకల్పంతో సోనియమ్మ మన ఆకాంక్షలు నెరవేర్చారు.

తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో.. మనం చూడలేదు..తెలంగాణ తల్లి సోనియమ్మ రూపంలో ఉంటుందని ఆ తల్లి మనకు భరోసా ఇచ్చిందని పేర్కొన్నారు సీఎం రేవంత్. తెలంగాణ ప్రజలు కృతజ్ఞత భావంతో ఉంటారని మొన్నటి ఎన్నికల తీర్పుతో నిరూపించారు…ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రజలు నాకు ఈ బాధ్యత ఇచ్చారన్నారు.