ఉత్తర్ ప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఈటాహ్ జిల్లా మలవాన్ ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది. జాతీయ రహదారి 91పై మలవాన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వంతెన కూలినపుడు అటుగా ఓ కారు రావడంతో అది సరిగ్గా వాహనంపైనే పడటంతో ఈ ఘటన జరిగింది. అయితే అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.