పొలం గట్టు విషయం అన్నదమ్ముల మధ్య గొడవకు దారి తీసింది.తమ్ముడిపై అన్న గొడ్డలితో దాడి చేశాడు. మైలవరం మండలం తొర్రివేముల గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ బి.రామకృష్ణ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తొర్రివేముల గ్రామానికి చెందిన గూడెంచెరువు కనకరాజ్, బాలయ్య అన్నదమ్ములు, వీరి మధ్య పొలం గట్టు విషయంలో గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది.
సోమవారం బాలయ్య తన కుమారుడు సుదర్శన్‌తో కలిసి పొలం పనులు చేసుకుంటుండగా అన్న కనకరాజ్ వచ్చి గొడ్డలితో తలపై దాడి చేశాడు. దీంతో బాలయ్య తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.