‌ బాలికని మోసం చేసిన అన్నదమ్ములు

‌ బాలికని మోసం చేసిన అన్నదమ్ములు

ప్రేమ పేరుతో ఇద్దరన్నదమ్ములు, ఇద్దరు మైనర్‌ బాలికలను మోసగించి, ఆనక ముఖం చాటేశారంటూ.. కుల పెద్దలు వారికి వివాహం చేయాలని నిశ్చయించారు. అనుకున్నదే తడవుగా అన్నదమ్ముల్లో తమ్ముడికి ఆదివారం అర్ధరాత్రి సమయంలో వివాహం చేశారు. మరుసటిరోజు సోమవారం ఉదయం అన్నయ్యకు వివాహం జరిపే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు.

మండలంలోని తిరుమలంపాలెం ఎస్సీ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. స్థానికుల కథనం ప్రకారం. కాలనీకి చెందిన ఇద్దరు బాలికలు(ఒకరి వయస్సు 16, మరొకరి వయస్సు 17) తమను ఇద్దరన్నదమ్ములు మోసగించి, గర్భవతులను చేశారంటూ కుల పెద్దలను ఆశ్రయించారు. దీనిపై ఆదివారం రాత్రి కాలనీలోని రామాలయం వద్ద పంచాయితీ నిర్వహించారు.

అనంతరం బాలికలకు, అన్నదమ్ములతో వివాహం జరపాలని తేల్చారు. దీంతో అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో అన్నదమ్ముల్లో మైనరైన(17 ఏళ్ల వయస్సు గల) తమ్ముడికి, 7 నెలల గర్భవతి అయిన బాలికతో వివాహం జరిపించారు. మరుసటి రోజు ఉదయం మేజరైన అన్నయ్యకు, 8 నెలల గర్భవతి అయిన బాలికతో వివాహం జరిపే ప్రయత్నం చేశారు.