జిల్లాలోని గడివేముల మండలం పెసరవాయిలో దారుణం చోటుచేసుకుంది. పాతకక్షల నేపథ్యంలో ఇద్దరు అన్నదమ్ముళ్లను వేటకొడవళ్లతో నరికి దారుణంగా హత్యచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
కాగా చనిపోయినవారు వడ్డు నాగేశ్వర్‌రెడ్డి, వడ్డు ప్రతాపరెడ్డిలుగా గుర్తించారు. కాగా పాతకక్షలే వీరి హత్యకు కారణమని భావించిన పోలీసులు కేసు నమోదు చేశారు.