25 ఏళ్ల వైభవాన్ని చాటిచెప్పేలా అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది గులాబీ పార్టీ. ఏప్రిల్ 27వ తేదీన జరగబోయే ఈ మహాసభకు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల సరిహద్దు ప్రాంతం వేదికైంది. తమ సత్తా ఏంటో ఈ సభ ద్వారా చాటుతామంటోంది కారు పార్టీ కేడర్. సభకు సుమారు పది లక్షల మంది కార్యకర్తలు వస్తారని పార్టీ అంచనా వేస్తోంది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చే జనాలకు ఏ మాత్రం ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్లాన్ ప్రకారం ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమయం దగ్గర పడుతుండటంతో పనులు వేగవంతంగా సాగుతున్నాయి.

