అసలే కరోనా కాలం. లాక్‌డౌన్‌ని మంచిగా ఎంజాయ్ చేస్తున్న విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులకి ఈ రోజు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 11 ఏళ్ళ నుండి ఎంతో అపురూపంగా పెంచుకున్న పెంపుడు కుక్క బ్రూనో మృతి చెందింది. దీంతో ఇద్దరు భావోద్వేగానికి లోనయ్యారు. విరాట్ తన ట్విట్టర్‌లో బ్రూనో ఫోటో షేర్ చేస్తూ.. ‘11 ఏళ్ల మన ప్రయాణం జీవితాంతం ఓ మధురమైన తీపి గుర్తుగా మిగిలి పోతుంది. ఈ రోజు ఇక్కడి నుంచి మరో మంచి చోటుకు వెళ్లావు.
నీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని కోరుకుంటున్నా’ అంటూ కోహ్లీ భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశాడు. అదేవిధంగా కోహ్లీ భార్య బాలీవుడ్ నటీమణి అనుష్క శర్మ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ‘మిస్ యూ బ్రూనో.. రిప్’ అంటూ పోస్ట్ చేశారు. ఒత్తిడిని తగ్గించుకొనేందుకు మేం బ్రూనోతో ఎక్కువగా ఆడుకుంటామని విరాట్ గతంలో ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పిన విషయం తెలిసిందే. కాగా అది మా కుటుంబంలో భాగమైందని.. అది ఉంటే మా ఇంట్లో సందడి ఎక్కువగా ఉంటుందని పలు సందర్భాలలో కోప్లీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.