హైదరాబాద్‌ లో దారుణ హత్య…తల బొల్లారంలో.. మొండెం మియాపూర్‌లో !

Brutal murder in Hyderabad .., Head in bollaram..Torso in Miyapur

హైదరాబాద్‌లో మరో దారుణ హత్య జరిగింది. మియాపూర్‌లోని దీప్తి శ్రీనగర్ ధర్మపురి క్షేత్రం వద్ద ఆటో డ్రైవర్ ప్రవీణ్(24)ను గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత్యచేశారు. శరీరం నుంచి వేరుచేసిన తలను బొల్లారం చౌరస్తా వద్ద పడేశారు.

ఈ ఘటన నిన్న అర్ధరాత్రి సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఉదయం ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని దర్యాప్తు చేపట్టారు. తల, మొండాన్ని సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

శ్రీకాంత్ యాదవ్, శ్రీనివాసులు అనే వ్యక్తులు ఈ హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు.