వైరల్ వీడియో: వామ్మో సమంత.. ఏంటా ఫిట్‌నెస్!

akkineni-samantha-new-fitness-stunt-video-goes-viral-on-social-media

దక్షిణాది సినీ పరిశ్రమల్లోని స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు.  అక్కినేనివారి కోడలు అయిన తరవాత సమంతకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత మెరిగింది. ఒకప్పుడు హీరోయిన్ పాత్రలు, గ్లామర్ రోల్స్ చేసిన సమంత ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ మూవీలపై దృష్టి పెట్టారు. ‘రంగస్థలం’, ‘యూటర్న్’, ‘మజిలీ’, ‘ఓ బేబీ!’, ‘సూపర్ డీలక్స్’ చిత్రాలు వీటికిఉదాహరణలు.

ఇదిలా ఉంటే, తాజాగా సమంత తన ఫిట్‌నెస్ వీడియో ఒకదానిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ వీడియోలో సమంతను చూస్తే ఆమె అభిమానులే కాదు ఎవరైనా షాక్ కావాల్సిందే. ప్రొఫెషనల్ అథ్లెట్ మాదిరిగా బార్స్‌ను రెండు చేతులతో పట్టుకొని జర జర పైకి పాకేస్తున్నారు. దీన్ని ‘పార్కౌర్’ అంటారట. ఫిట్‌నెస్ ట్రైనర్ అభినవ్ ఆధ్వర్యంలో సమంత ఈ పార్కౌర్ ఫీట్లు చేశారు. అదొక్కటే కాదు రెండు రోజుల క్రితం సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కొన్ని వీడియోలు పెట్టారు. అవి కూడా ఫిట్‌నెస్‌కు సంబంధించినవే. అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.