పూరి జ‌గ‌న్నాథ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ –ఫైట‌ర్‌

Puri Jagannath, Vijay Devarakonda - Fighter

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రారంభం కానుందనే సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి `ఫైట‌ర్‌` అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌ను ఖ‌రారు చేశారు. రీసెంట్‌గా విడుదలైన `ఇస్మార్ట్ శంకర్`తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు పూరి జగన్నాథ్.

ఈ తరుణంలో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ వంటి క్రేజీ కాంబినేషన్‌లో రూపొందబోయే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి, చార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది. ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌న్నింటినీ పూర్తి చేసుకుని జ‌న‌వ‌రి నుండి ఈ సినిమా సెట్స్ పై కి వెళ్ల‌నుంది. హీరోల‌ను మాస్ యాంగిల్‌లో తెర‌పై ప్రెజెంట్ చేసే పూరి జ‌గ‌న్నాథ్.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌లోని మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించ‌నున్నారు.