రాజీనామా చేసిన యడ్యూరప్ప, శ్రీ రాములు

BS Yeddyurappa And B Sriramulu resigned from Lok Sabha

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బీఎస్ యడ్యూరప్ప ఈరోజు తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే, మోకల్మూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీరాములు కూడా ఇన్నిరోజులు తాను ప్రాతినిధ్యం వహించిన లోక్ సభ స్థానానికి రాజీనామా సమర్పించారు. అయితే వీరిద్దరి రాజీనామాలను అందుకున్న లోక్ సభ స్పీకర్ వాటిని వెంటనే ఆమోదించారు. ఈ రోజు కర్ణాటక అసెంబ్లీలో సీఎం యడ్యూరప్ప ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని బల నిరూపణ చేయాల్సి ఉంది. 2014 ఎన్నికల్లో ఎంపీలుగా ఎన్నికయిన యడ్యూరప్ప షిమోగ లోక్ సభ స్థానం నుంచి, శ్రీరాములు బళ్లారి లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు.