తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం

తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. భక్తులు ప్రయాణిస్తున్న ఆర్‌టిసి బస్సుకు ప్రమాదం సంభవించింది. ఈరోజు ఉదయం తిరుమల రెండవ ఘాట్‌ రోడ్‌ లో వెళుతున్న ఆర్‌టిసి బస్సును గాలి బీభత్సం ఉధృతంగా ఉండటంతో డ్రైవర్‌ బస్సును లెఫ్ట్‌ కు తిప్పాడు. దీంతో బస్సు 25 అడుగుల లోతులో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పది మంది భక్తులకు గాయాలయ్యాయి. గాయపడినవారందరినీ తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.