ఏపీ పది ఫలితాలు…బాలికలదే హవా

ఆంధ్రప్రదేశ్‌‌లో పదోతరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం (మే 14) వెలువడ్డాయి. మే 14న ఉదయం 11 గంటలకు ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో మొత్తం 94.88 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వీరిలో బాలుర ఉత్తీర్ణత శాతం 94.68% ఉండగా.. బాలికల ఉత్తీర్ణత శాతం 95.09గా ఉంది. ఫలితాల్లో పశ్చిమ గోదావరి జిల్లా 98.19 శాతంతో ప్రథమస్థానంలో నిలవగా.. నెల్లూరు జిల్లా 83.19 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ప్రకాశం, చిత్తూరు జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.  పదోతరగతి ఫలితాల్లో మొత్తం 99.88 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వీరిలో బాలుర ఉత్తీర్ణత శాతం 94.68% ఉండగా.. బాలికల ఉత్తీర్ణత శాతం 95.09గా ఉంది. ఫలితాల్లో మొత్తం 33,972 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. ఫలితాల్లో పశ్చిమ గోదావరి జిల్లా 98.19 శాతంతో ప్రథమస్థానంలో నిలవగా.. నెల్లూరు జిల్లా 83.19 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ప్రకాశం, చిత్తూరు జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 5456 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. ప్రకాశం (98.17), చిత్తూరు (97.41), విజయనగరం (97.28), విశాఖపట్నం (96.37), శ్రీకాకుళం (95.58), అనంతపురం (95.55), గుంటూరు (95.35), కృష్ణా (93.96), పశ్చిమగోదావరి (93.29), కడపం (92.90), కర్నూలు (92.10), నెల్లూరు (83.19) 5464 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదుకాగా..3 స్కూళ్లలో ‘సున్నా’శాతం ఉత్తీర్ణత నమోదైంది.ఇక రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం మే 30 లోపు దరఖాస్తు కోవాల్సి ఉంటుంది. ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చెల్లించాలి. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 17 నుంచి 29 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాక కమిషనర్ సంధ్యారాణి వెల్లడించారు. విద్యార్థులు జూన్ 7లోగా సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రెండు రోజుల్లో మార్కుల మెమోను అందుబాటులో ఉంచనున్నట్లు ఆమె తెలిపారు.